Homeజిల్లా వార్తలు"అల్బెండజోల్ టాబ్లెట్" ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

“అల్బెండజోల్ టాబ్లెట్” ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

ఇదే నిజం దేవరకొండ: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం దేవరకొండ మండల పరిధిలోని తూర్పు పల్లి గ్రామంలో ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు “అల్బెండజోల్ టాబ్లెట్” ను పంపిణీ చేశారు .అనంతరం పాఠశాల బృందం మరియు వైద్య ఆరోగ్యశాఖ వారి బృందం వారి కలిసి ఎమ్మెల్యే కి శాలువాతో సత్కరించారు.ఈ సందర్బంగా వైద్యాధికారి మాట్లాడుతూ ఈ వ్యాధి పిల్లలను పట్టిపీడించే అనారోగ్య సమస్యల్లో నులుపురుగులు ప్రధానమైనవి అని అన్నారు. ఈ పురుగులు పిల్లల పొట్టలో చేరి మేలిపెడుతూ వారి ఎదుగుదలను శాసిస్తుంటాయి అన్నారు. రక్తహీనత,పోషకలోపంపలు ఆనారోగ్య సమస్యలకు కారణమవుతుంటాయి అన్నారు. నూలి పురుగుల నివారణలో భాగంగా ఏట రెండుసార్లు ఆల్బెండజోల్ మాత్రాలను ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ జాని యాదవ్, జడ్పిటిసి అరుణ సురేష్ గౌడ్, డిప్యూటీ హెచ్ఎం & హెచ్ ఓ కృష్ణ కుమారి,మండల వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్ నాయక్ ,నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, ,గ్రామ నాయకులు, దయానంద్,వెంకటయ్య, సురేష్,నాగరాజు నాయక్, భీముడు,కార్యకర్తలు, మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img