ఇదే నిజం, దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో ఉన్న నీటి సమస్యలు గురించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో నేడు ఆర్డబ్ల్యూఎస్ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే నేనావత్ బాలు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, ఎంపీపీ జాను యాదవ్,బిక్కు నాయక్, పిఎసిఎస్ చైర్మన్ శ్రీశైలం యాదవ్, మాజీ మార్కేట్ కమిటీ ముక్కమల్ల వెంకటయ్య, వివిధ శాఖల యస్ఈఈ,డిఈ,ఏఈ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.