ఇదే నిజం, దేవరకొండ: కిష్టారాయిన్ పల్లి భూ నిర్వాసులతో స్థానికఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడారు,గత ప్రభుత్వ హయాంలో డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా కిష్టారాయిన్ పల్లి ఈదుల గండి ప్రాంతాలలో భూములను,ఇండ్లను కోల్పోయిన బాధితులతో శనివారంఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో వారి సమస్యలు అడిగి తెలుసుకొని వెంటనే సంబంధించిన అధికారులను ఫోన్లో మాట్లాడి,స్వయంగా రాజస్వ అధికారి కార్యాలయానికి వెళ్ళి గ్రామ ప్రజల సమస్యను పరిష్కరించాలని ఆర్డీవోకి సూచించారు.గ్రామ వాసులు అధైర్య పడవద్దు అన్ని విధాలుగా అండగా ఉంటానని తమకు రావలసిన ఆర్ ఆర్ ప్యాకేజీని వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు. మాకు మీరే దిక్కు అని ప్రజలు ఎమ్మెల్యే కువారి బాధలు చెప్పారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు యూనిస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కమల్ల వెంకటయ్య, పిఎసిఎస్ చైర్మన్ వేణుదర్ రెడ్డి,రైతులు,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.