Homeహైదరాబాద్latest Newsప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇదే నిజం, దేవరకొండ : డిండి(గుండ్లపల్లి) మండలంలోని గోనబోయినపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ వేలాద్రి కోదండ సీతారామ లక్ష్మణ సహిత పంచముఖ ఆంజనేయ స్వామి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ యువకులు ఎమ్మెల్యే కి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయంలో మిగిలిన నిర్మాణ పనులను పూర్తి చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బద్దెల శ్రీనివాస్ యాదవ్,యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రెటరీ అనిల్ కుమార్, రవి, పాపయ్య, మల్లయ్య, బాలకృష్ణ, శ్రీశైలం, దామోదర్ ,అంజి,శుభాష్,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img