HomeతెలంగాణMLA Seethakka : మంత్రులను కాదని సీఎం జోక్యం చేసుకోవడమేంటో

MLA Seethakka : మంత్రులను కాదని సీఎం జోక్యం చేసుకోవడమేంటో

MLA Seethakka on fire on cm and assembly speaker : మంత్రులను కాదని సీఎం జోక్యం చేసుకోవడమేంటో..

రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే గ్రామ స్వరాజ్యం నిధుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటా ఎంతని ప్రశ్నిస్తే మైక్ కట్ చేశారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రతిపక్షాల గొంతు నొక్కడం వల్ల అధికార పార్టీ సభ్యులకు ఏం ఆనందం కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు.

”గ్రామ పంచాయతీలకు నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెబుతోంది. మరో వైపు మేమే ఇస్తున్నామని కేంద్రం అంటోంది.

రాష్ట్రం, కేంద్రం నిధులు ఎంతో ప్రభుత్వం స్పష్టం చేయాలి.

గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయం ఎంత? కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ప్రశ్నిస్తే సబ్జెక్ట్‌ కాదంటున్నారు.

మంత్రులను కాదని ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడం ఏంటో అర్థం కావడం లేదు. ప్రజా సమస్యలపై మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు.

డబ్బా కొడుతుంటే మాత్రం స్పీకర్ గంటల కొద్దీ సమయం ఇస్తున్నారు. సభ్యుల హక్కులు, సభా సంప్రదాయాలను సీఎం గౌరవించాలి.

ప్రతిపక్షాల ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాలను సర్పంచ్‌లు విశ్లేషించుకోవాలి” అని సీతక్క అన్నారు.

Recent

- Advertisment -spot_img