Homeహైదరాబాద్latest Newsగొప్ప మనసు చాటుకున్న ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి.. సౌదీలో అనారోగ్య కార్మికుడికి అండ

గొప్ప మనసు చాటుకున్న ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి.. సౌదీలో అనారోగ్య కార్మికుడికి అండ

ఇదే నిజం, జగిత్యాల జిల్లా: జగిత్యాల పట్టణం మహాలక్ష్మి వాడకు చెందిన సిరిమల్ల విష్ణు (39) ఏప్రిల్ మొదటి వారంలో ఒక కంపెనీలో క్లీనర్ గా పని చేయడానికి సౌదీ అరేబియాలోని రియాద్ కు చేరుకున్నాడు. వెళ్ళేటప్పుడు ఆరోగ్యంగా (మెడికల్ ఫిట్) ఉన్న విష్ణు, అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించక మెడపై గడ్డలు ఏర్పడి, రక్త విరేచనాలతో తీవ్ర అనారోగ్యం పాలయి ఆసుపత్రిలో చిత్స పొందుతున్నాడు.

విష్ణు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి దృష్టికి తీసికెళ్ళారు. వెంటనే స్పందించిన జీవన్ రెడ్డి పేషేంట్ విష్ణును ఇండియాకు వాపస్ పంపాలని కోరుతూ ‘ఎక్స్’ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి, సౌదీ అరేబియా రియాద్ లోని ఇండియన్ ఎంబసీకి, ఢిల్లీలోని విదేశాంగ శాఖకు ట్వీట్ చేశారు. స్పందించిన భారత రాయబార కార్యాలయం అధికారులు, కంపెనీ యాజమాన్యం విష్ణును ఇంటికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. సౌదీ లోని సోషల్ వర్కర్స్ ఇర్ఫాన్, ఫారూఖ్, చేతన, లతీఫ్ తెచ్చి, షిహాబ్ కొట్టుకడ్ తదితరులు విష్ణుకు సహకరిస్తున్నారు

Recent

- Advertisment -spot_img