HomeSocial Mediaమాజీ మోడల్ దారుణ హత్య

మాజీ మోడల్ దారుణ హత్య

గురుగ్రామ్ హోటల్‌లో మాజీ మోడల్, గ్యాంగ్‌స్టర్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ దివ్య పహుజా హత్యకు గురైంది. హోటల్ యజమాని, అతని సహచరులు హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ హత్య ఉదంతం, నిందితులు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యారు. BMW కారులో మృతదేహాన్ని తీసుకెల్లి గుర్తు తెలియని ప్రదేశంలో పడేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. హత్యకు కారణం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దివ్యపహుజా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు. గండోలికి సంబంధించి బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఈమె ఏడేళ్ల పాటు జైలులో ఉన్నారు. గతేడాది జూన్ నెలలో బెయిల్ మంజూరైంది. మంగళవారం గురుగ్రామ్ హోటల్‌లో హత్యకు గురైంది. పహుజా కనిపించడం లేదని ఆమె కుటుంబం ఫిర్యాదు చేయడంతో ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img