తెలంగాణ మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష (TGMS CET 2025) తేదీలను ప్రకటించారు. ఏప్రిల్ 27 తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులుఅభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఏప్రిల్ 21 తేదీ నుండి అధికారిక వెబ్‌సైట్ telanganams.cgg.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షలు ప్రతి రోజు రెండు షిఫ్ట్‌లలో:
- మొదటి షిఫ్ట్: 6వ తరగతి ప్రవేశ పరీక్ష – ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.
- రెండవ షిఫ్ట్: 7వ నుండి 10వ తరగతుల ప్రవేశ పరీక్ష – మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:00 వరకు.
అభ్యర్థులు హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి అవసరమైన లాగిన్ వివరాలను (క్యాండిడేట్ ID/రిఫరెన్స్ ID మరియు పుట్టిన తేదీ) సిద్ధంగా ఉంచుకోవాలి. పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు తీసుకెళ్లడం తప్పనిసరి. మరిన్ని వివరాల కోసం, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: telanganams.cgg.gov.in.