Homeజాతీయంmodi:వారసత్వం’ డేంజర్​

modi:వారసత్వం’ డేంజర్​

వారసత్వం’ డేంజర్​
– సమర్థులు ప్రధానులు కాకపోవడానికి కారణమదే..
– ఎన్టీఏ కూటమిలోని మిత్రపక్షాలు మాకు ముఖ్యం
– అవినీతి రాజకీయాలు ప్రమాదం
– ఎన్డీఏ కూటమి ఎంపీలతో ప్రధాని మోడీ

ఇదే నిజం, నేషనల్​ బ్యూరో: మనదేశంలో వారసత్వం రాజకీయం ఎంతో డేంజర్​ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాల వల్లే చాలా మంది సమర్థులు ప్రధానులు కాలేకపోయారని ఆరోపించారు. అవినీతి రాజకీయాలు మన దేశానికి పట్టిన మరో చీడ అని మోడీ తెలిపారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ గతంలో ప్రధాని కాకపోవడానికి కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాలే కారణమని ప్రధాని మోదీ ఆరోపించారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందిన ఎన్డీయే కూటమి ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘కాంగ్రెస్‌ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే నడుస్తోంది. ప్రతిపక్షంలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. కానీ, ఆ పార్టీ వారసత్వ రాజకీయాల కారణంగా వారిని ప్రోత్సహించలేదు. దీనివల్ల శరద్‌ పవార్‌, ప్రణబ్‌ ముఖర్జీ వంటి అత్యంత సమర్థులకు ప్రధాని అయ్యే అవకాశం లభించలేదు’’అని అన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న మిత్రపక్షాలే తమకు ముఖ్యమని.. సమష్టిగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. అందువల్లే తమకు ఎంతో గౌరవం లభిస్తోందని ప్రధాని ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌లా బీజేపీకి అహంకారం లేదన్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఇతరుల కంటే భిన్నంగా ఉంటానని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో మాట్లాడిన విషయాలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img