Homeఅంతర్జాతీయంModi : ప్రధాని మోడీ కి మాతృ వియోగం

Modi : ప్రధాని మోడీ కి మాతృ వియోగం

Modi : ప్రధాని నరేంద్రమోడీకి మాతృవియోగం కలిగింది. మాతృమూర్తి హీరాబెన్ మోడీ కన్నుమూశారు. ఆమె వయసు 100 ఏళ్ళు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు హీరాబెన్ మోడీ. అయితే గురువారం ఆమె కోలుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థత నుంచి కోలుకుంటున్నట్లు యూఎన్ మెహతా ఆసుపత్రి గురువారం రాత్రే ప్రకటించింది.

అయితే కొద్దిగంటల్లోనే ఈవిషాదం వినాల్సి వచ్చింది.ఆమె అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను బుధవారం ఈ ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మోదీ హుటాహుటిన ఈ ఆసుపత్రిని సందర్శించి, తన తల్లితో మాట్లాడారు.

దాదాపు గంటన్నర సేపు ఆమె వద్ద ఉన్నారు. అనంతరం న్యూఢిల్లీ వెళ్ళారు. హీరాబెన్‌ను ఒకట్రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిస్తారని బీజేపీ నేతలు భావించారు. అయితే హఠాత్తుగా ఆమె మరణించారన్న వార్త మోడీని తీవ్రవిషాదంలో నింపేసింది. హీరాబెన్ మోడీ ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు. ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. Modi

Recent

- Advertisment -spot_img