HomeతెలంగాణModi tour:మోదీ వరంగల్‌ పర్యటనకు సర్వం సిద్ధం

Modi tour:మోదీ వరంగల్‌ పర్యటనకు సర్వం సిద్ధం

Modi tour:ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా రేపు వరంగల్‌ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టారు. వరంగల్‌ నగరాన్ని హైసెక్యూరిటీ జోన్‌గా మార్చనున్నారు. SPG, కేంద్ర, రాష్ట్ర బలగాలతో అంచలంచెలుగా సెక్యూరిటీ ఇవ్వనున్నారు. కేంద్ర బలగాలు ముందస్తుగా నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. వరంగల్ చుట్టూ 20 కి.లో. మీటర్ల మేర 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఇక వరంగల్‌ను రేపు నో ఫ్లై జోన్ ఆంక్షలు అమలు చేయనున్నారు. డ్రోన్‌లు, రిమోట్ కంట్రోల్ పరికరాలు, ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లయింగ్ నిషేధించారు. ఇక ప్రధాని సందర్శించనున్న భద్రకాళి ఆలయం పోలీసుల నిఘా నీడలోకి వెళ్లింది. అణువణువునా సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
మోదీ షెడ్యూల్ వివరాల్లోకి వెళితే.. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.15 గంటల నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మామునూరు ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో భద్రకాళి గుడికి చేరుకుంటారు. దర్శన అనంతరం 11 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంకు చేరుకుంటారు మోదీ. అనంతరం 6 వేల 110 కోట్ల రూపాయలతో చేపట్టే జాతీయ రహదారులు, 521 కోట్ల రూపాయలతో చేపట్టే కాజీపేట రైల్వే వ్యాగన్ రిపేర్ అండ్ మ్యానిప్యాక్షరింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 11.45 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

తర్వాత 12.50 గంటలకు వరంగల్ మామునూరు హెలిప్యాడ్‌ నుంచి హకీంపేటకు పయనమవుతారు. మధ్యాహ్నం 1.45 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో రాజస్థాన్ కు మోదీ తిరుగు పయనమవుతారు. దీంతో మోదీ తెలంగాణ టూర్‌ ముగుస్తుంది.

Recent

- Advertisment -spot_img