తెలుగు చలన చిత్ర పరిశ్రమ అగ్ర నటుడు మాజీ రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తోటి నటుడు మోహన్ బాబు ఒక ప్రత్యేకమైన బహుమతిని అందజేశారు. తన స్నేహితునికి చెక్కతో చేయించిన బైక్ కానుకగా పంపారు. ఈ విషయాన్ని చిరంజీవి తన అభిమానులకు తెలియజేశారు. నా చిరకాల మిత్రుడు తోలిసారి నా పుట్టిన రోజు బహుమతిగా ఈ అందమైన బహేమతిని పంపాడని చిరు ట్విట్టర్ వేధికగా తన అభిమానులకు తెలిపారు. ఆ కానుకను ఉద్దేశించి చిరు మాట్లాడుతూ మోహన్ బాబు కళాకృతిని కానుకగా పంపాడు, ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్యం ఉట్టిపడుతుంది అని తెలిపారు. మరొకసారి నా ప్రియతమ మిత్రుడు మోహాన్బాబుకు థాంక్యు అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.
ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి
RELATED ARTICLES