HomeజాతీయంMonkeypox : దేశంలో మంకీపాక్స్‌ వైరస్ కలకలం

Monkeypox : దేశంలో మంకీపాక్స్‌ వైరస్ కలకలం

Monkeypox : దేశంలో మంకీపాక్స్‌ వైరస్ కలకలం

Monkeypox : దేశంలో మంకీపాక్స్‌ వైరస్ కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్‌ లక్షణాలు బయటకు వచ్చాయి.

వివరాల ప్రకారం.. యూపీలోని ఘజియాబాద్‌లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్‌ లక్షణాలు బయటపడ్డాయి.

కాగా, బాధితురాలి శరీరంపై దద్దర్లు రాగా, దురద ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.

దీంతో, శాంపిల్స్‌ సేకరించి పూణేలోని ల్యాబ్‌కు టెస్ట్‌ కోసం పంపినట్టు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు.

ఇక, చిన్నారి కుటుంబానికి ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేదని వైద్యులు స్పష్టం చేశారు.

దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు అలర్ట్‌ అయ్యారు.

ఇదిలా ఉండగా.. ఫ్రాన్స్‌లో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.

బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది.

కాగా, ఫ్రాన్స్‌లో మొదటి మంకీపాక్స్‌ కేసు మే నెలలో నమోదు అయింది. ఇక, జూన్‌ నాటికి ఈ కేసుల సంఖ్య 100ను దాటింది.

Recent

- Advertisment -spot_img