పండుగ రోజుల్లో వంట నూనెల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. గత నెలలో రూ.100 పలికిన లీటర్ పామాయిల్ ధర ఇప్పుడు రూ.137కి చేరగా.. సోయాబీన్ నూనె ధర రూ.120 నుంచి రూ.148కి, సన్ఫ్లవర్ ఆయిల్ ధర రూ.120 నుంచి రూ.149కి, ఆవనూనె ధర రూ.140 నుంచి రూ.181కి, వేరుశనగ నూనె ధర రూ.180 నుంచి రూ.184కి పెరిగింది.