Homeమరిన్నిMosquito Bites : కొంద‌రిని దోమ‌లు ఎక్కువ‌గా కుట్ట‌వు.. ఎందుకో తెలుసా..

Mosquito Bites : కొంద‌రిని దోమ‌లు ఎక్కువ‌గా కుట్ట‌వు.. ఎందుకో తెలుసా..

Mosquito Bites : కొంద‌రిని దోమ‌లు ఎక్కువ‌గా కుట్ట‌వు.. ఎందుకో తెలుసా..

Mosquito Bites : మీరు స‌రిగ్గా గ‌మ‌నించారో !! లేదో !! న‌లుగురు వ్య‌క్తులు ఒక్క‌చోట చేరిన‌ప్పుడు అందులో అంద‌రూ దోమ‌లు కుడుతున్నాయ‌ని ఇబ్బంది ప‌డుతున్న‌ప్ప‌టికీ.. ఒక‌రు మాత్రం ఎలాంటి చ‌ల‌నం లేకుండా ఉంటుంటారు.

అలాంటి వాళ్ల‌ను చూసి దోమ‌లు కుడుతున్న వీడికి చ‌ల‌న‌మే లేద‌ని అనుకుంటాం.

కానీ నిజానికి వాళ్ల‌ను దోమ‌ల్ని కుట్ట‌వు. అవును !! కొంత‌మందిని మాత్ర‌మే దోమ‌లు కుడ‌తాయి.

మిగిలిన వాళ్ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోవు. అదేంటి.. కార‌ణం ఏమై ఉంటుంద‌ని అనుకుంటున్నారా.. ఈ విష‌యాలు చ‌దివితే మీకే తెలుస్తుంది.

దోమలకు ఉదయం పెద్దగా కళ్లు కనిపించవు. మధ్యాహ్నం నుంచి వాటి చూపు బెటర్ అవుతుంది.

సాయంత్రం, రాత్రి అయ్యేకొద్దీ వాటి కళ్లు బాగా కనిపిస్తాయి.

ఐతే ఇంట్లోకి రాగానే అవి డార్క్ కలర్ బట్టలు వేసుకున్నవాళ్లకు అట్రాక్ట్ అవుతాయి.

నేవీ బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ బట్టలు వేసుకున్న వారిని ఎక్కువగా దోమలు కుడతాయి.

Google : అమ్మాయిలు గూగుల్ ఎక్కువ‌గా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా..

Pigs as gifts : ఈ స్కూల్‌లో స్టూడెంట్స్‌కు పందులే బ‌హుమ‌తిగా ఇస్తారు.. ఎందుకో తెలుసా..

మనం ఆక్సీజన్ పీల్చుతూ, కార్బన్ డై ఆక్సైడ్ వదులుతాం. దోమలకు కార్బన్‌డై ఆక్సైడ్ అంటే చాలా ఇష్టం.

160 అడుగుల దూరంలో ఉండి కూడా కార్బన్‌డై ఆక్సైడ్ వాసనను గుర్తుపట్టి మనుషుల దగ్గరకు వస్తాయి.

లావుగా, అధిక బరువు ఉన్నవారు ఎక్కువ కార్బన్‌డై ఆక్సైడ్ విడుదల చేస్తారు.

అందుకని వారిని ఎక్కువగా దోమలు కుడతాయి.

మన శరీరం నుంచి వచ్చే చెమటలో లాక్టిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్, అమ్మోనియా వంటివి ఉంటాయి.

అవి దోమలకు చాలా ఇష్టం. ఎవరైనా బాగా శ్రమించి, చెమటతో ఉంటే వారిని ఎక్కువగా ఆశ్రయించి కుడతాయి.

మన స్కిన్ చక్కగా ఉండాలి. కురుపులు, గాయాలు ఉండకుండా చూసుకోవాలి. చర్మాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

అందువల్ల చర్మంపై సూక్ష్మక్రిముల సంఖ్య తగ్గిపోతుంది. సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉండే చర్మంపై దోమలు ఎక్కువగా వాలతాయి.

గర్భంతో ఉన్న మహిళలు ఎక్కువగా కార్బన్‌డై ఆక్సైడ్ విడుదల చేస్తారు.

అందువల్ల అలాంటి వాళ్లను దోమలు ఎక్కువగా కుడతాయి.

ఆఫ్రికాలో ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలకు మలేరియా ఎక్కువగా సోకుతున్నదని ఓ పరిశోధనలో తేలింది.

సాధారణ వ్యక్తులతో పోలిస్తే గర్భిణులను 21 శాతం ఎక్కువగా దోమలు కుడతాయి.

Airplane drops human waste : విమానంలో బాత్‌రూమ్​ వ్యర్థాలు గాలిలోనే జనాల మీద వదిలేస్తారా

Shopping Tricks : బ్రాండెడ్​ షర్టులు తక్కువ ధరకే కావాలా.. ట్రిక్స్​

Recent

- Advertisment -spot_img