Homeహైదరాబాద్latest Newsత‌దుప‌రి ఆదేశాలు ఇచ్చేవ‌ర‌కు..ఎంపీ బండి సంజ‌య్‌ను అరెస్ట్ చేయ‌కండి

త‌దుప‌రి ఆదేశాలు ఇచ్చేవ‌ర‌కు..ఎంపీ బండి సంజ‌య్‌ను అరెస్ట్ చేయ‌కండి

  • పోలీసుల‌ను ఆదేశించిన తెలంగాణ హైకోర్టు
  • సీఆర్‌పీసీ చ‌ట్టం ప్రకారం 41ఏ నోటీసులు జారీ చేయండి
  • ఆ త‌ర్వాతే విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశం
  • త‌దుప‌రి విచార‌ణ జూన్ 11కు వాయిదా
  • ఆలోపు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని అధికారుల‌క స్ప‌ష్టం చేసిన ధ‌ర్మాస‌నం

ఇదే నిజం, హైద‌రాబాద్ : తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ను అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణను జూన్‌ 11కు వాయిదా వేస్తూ, ఆలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. సంజయ్‌ సహా ఇతర పిటిషనర్లకు సీఆర్‌సీపీ చట్టప్రకారం 41ఏ నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణ చేపట్టాలని చెప్పింది. ‘చెంగిచర్ల’ఘటనలో తనపై రాజకీయ ప్రేరేపితంగా తప్పుడు కేసు పెట్టారని.. ఉప్పల్‌, మేడిపల్లిలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో సంజయ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురు క్వాష్‌ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ బుధవారం విచారణ చేపట్టారు. వాదనల అనంతరం న్యాయమూర్తి.. సంజయ్‌, ఇతర పిటిషనర్లను అరెస్టు చేయవద్దని ఆదేశిస్తూ, విచారణను జూన్‌ 11కు వాయిదా వేశారు. బోడుప్పల్ నగర పాలక సంస్థ చెంగిచర్లలో హోలీ వేడుకల సందర్భంగా రోహింగ్యాలకు, ఎస్టీలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రోహింగ్యాలు అకారణంగా హిందువుల(ఎస్టీ)పై దాడి చేశారని, చిన్నపిల్లలతో పాటు పలువురు గాయపడ్డారని పేర్కొంటూ.. బాధితులను పరామర్శించేందుకు బండి సంజయ్‌ అక్కడి వెళ్లారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో వారికి, బీజేపీ కార్యకర్తలకు తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఉప్పల్‌, మేడిపల్లి పోలీస్‌ స్టేషన్లలో బండితో పాటు మరికొందరిపై ప్రజా ఆస్తుల నష్ట నివారణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే

Recent

- Advertisment -spot_img