Homeహైదరాబాద్latest Newsనీటి సరఫరా తీరును పరిశీలిస్తున్న ఎంపీడీవో

నీటి సరఫరా తీరును పరిశీలిస్తున్న ఎంపీడీవో

ఇదే నిజం, జైపూర్ : మండల పరిధిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని స్థానిక ఎంపీడీవో గుర్రం సత్యనారాయణ గౌడ్ తెలిపారు. గురువారం టేకుమట్ల, గంగిపల్లి, ఇందారం గ్రామాలలో తాగునీటి సరఫరా కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ఇందారం గ్రామంలో గల శివాలయం సమీపంలో గల బోరు బావి విద్యుత్ మోటర్ చెడిపోయినందున మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా నీటి సరఫరా చేస్తామన్నామని తెలిపారు. గంగిపల్లి గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో గల బోరుబావిని పునరుద్ధరించి నీటి సరఫరా ప్రారంభిస్తామని తెలిపారు.. అదేవిధంగా మిషన్ భగీరథ పైప్లైన్ పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. నీటి సమస్య ఎదురై తప్పదు అనుకున్నప్పుడు నేరుగా ట్యాంకర్ల ద్వారా గ్రామీణులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ శివారులో గల వ్యవసాయ బావుల నుండి నీటిని సమకూర్చడం కోసం బోరుబావులను గుర్తించడం జరిగిందని అన్నారు.

Recent

- Advertisment -spot_img