Homeహైదరాబాద్latest NewsMr Bachchan Review: 'మిస్టర్ బచ్చన్' మూవీ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?

Mr Bachchan Review: ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?

హరీష్ శంకర్, రవితేజ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ భారీ అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఇది అజయ్ దేవగణ్ రెయిడ్ సినిమాకు రీమేక్ అని తెలియడంతో అంతా పెదవి విరిచారు. కానీ టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మిస్టర్ బచ్చన్ మీద అంచనాలు పెంచేశాడు హరీష్ శంకర్. హరీష్ శంకర్ రీమేక్‌ చేస్తున్నాడంటే.. ఎంతలా మార్పులు చేర్పులు చేసి ఉంటాడో చెప్పాల్సిన పని లేదు. ఓ రీమేక్ హరీష్ శంకర్ చేతిలో పడిందంటే దాని స్వరూపమే మారిపోతోంది. ఇక తనకు ఎంతో ఇష్టమైన రవితేజతో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడో చెప్పాల్సిన పని లేదు. అజయ్ దేవగణ్‌కి, రవితేజకు ఎంత వ్యత్యాసం ఉంటుందో.. రెయిడ్కి, మిస్టర్ బచ్చన్‌కి అంత తేడా ఉంటుందని చెప్పాడు హరీష్ శంకర్. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం..

కథ:
బచ్చన్ (రవితేజ).. 80వ దశకంలో ఆదాయపు పన్ను అధికారిగా 70కి పైగా రైడ్స్ చేసి మంచి పేరు సంపాదిస్తాడు. అతడి అసలు పేరు ఆనంద్ అయినప్పటికీ.. ‘షోలే’ సినిమాతో అమితాబ్ బచ్చన్ వీరాభిమానిగా మారిన తన తండ్రి బచ్చన్ అని పేరు మార్చేస్తాడు. ఆ పేరుతోనే అతను పాపులర్ అవుతాడు. ఐతే ఒక ఐటీ రైడ్ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య అతను సస్పెండ్ అవుతాడు. దీంతో తన ఊరికి వచ్చేసి ఒకప్పటి వ్యాపకమైన ఆర్కెస్ట్రాలో సింగర్ గా కొనసాగుతుంటాడు. ఈ క్రమంలోనే తన ఊరికే చెందిన జిక్కి (భాగ్యశ్రీ బోర్సే)తో ప్రేమలో పడతాడు. నెమ్మదిగా జిక్కి కూడా బచ్చన్ ను ప్రేమిస్తుంది. వీళ్లిద్దరి పెళ్లికి రంగం సిద్ధమవుతున్న తరుణంలో బచ్చన్ మీద సస్పెన్షన్ ఎత్తేసిన ప్రభుత్వం.. అతణ్ని ముత్యం జగ్గయ్య (జగపతిబాబు) అనే పవర్ ఫుల్ పొలిటీషియన్ ఇంటి మీదికి ఐటీ రైడ్ కు పంపిస్తుంది. అప్పటికే జగ్గయ్య తమ్ముడితో వైరం పెట్టుకున్న బచ్చన్.. రైడ్ కు వెళ్లాక అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వాటన్నింటినీ అతనెలా అధిగమించాడు.. మరోవైపు జిక్కితో తన పెళ్లి జరిగిందా లేదా అన్నది మిగతా కథ.

విశ్లేషణ:
‘మిస్టర్ బచ్చన్’ లో హరీష్ శంకర్ రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే చాలా వరకు తేడా కొట్టిందనే చెప్పాలి. ఇక ఆయన క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా చాలా వరకు నిరాశపరిచింది. ఎక్కడ కూడా సినిమాకి సంబంధించిన ఎలివేషన్స్ గాని, ఎమోషన్స్ గాని గాని వర్కౌట్ చేసే విధంగా ఆయన ప్రయత్నం చేయలేదు…ఇక ముఖ్యంగా ఈ సినిమాలో హరీష్ శంకర్ రవితేజ ను ప్రజెంట్ చేసిన విధానం కూడా ప్రేక్షకుల్లో ఇంపాక్ట్ చూపించలేకపోయింది…ఇక రవితేజ ఈ సినిమాలో కొంచెం డల్ గా కనిపించినట్టుగా అనిపించింది. అలాగే చమ్మక్ చంద్ర, ప్రభాస్ శీను మధ్య వచ్చే కామెడీ కొంతవరకు పర్లేదు గా కనిపించినట్టుగా అనిపించింది. అలాగే చమ్మక్ చంద్ర, ప్రభాస్ శీను మధ్య వచ్చే కామెడీ కొంతవరకు పర్లేదు అనిపించింది.

సాంకేతిక విభాగం :
‘మిస్టర్ బచ్చన్’ లో స్క్రీన్ ప్లే అస్సలు బాగాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా మెప్పించలేక పోయింది. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి తగ్గించాల్సింది. నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, అభిషేక్ పాఠక్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ లో వచ్చిన కొన్ని సీన్లు
సత్య కామెడీ

మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
మ్యూజిక్
కథలో చేసిన మార్పులు
విజువల్స్

చివరిగా: జస్ట్ సినిమా ను చేస్తున్నామనే ఫీల్ కలుగుతుందే తప్ప.. పెద్దగా మ్యాజిక్ అయితే కనిపించదు

రేటింగ్ : 2.5/5

Recent

- Advertisment -spot_img