HomeరాజకీయాలుBRS ​లో చేరిన ముద్దగౌని రామ్మోహన్ దంపతులు

BRS ​లో చేరిన ముద్దగౌని రామ్మోహన్ దంపతులు

ఇదే నిజం, హైదరాబాద్: ఎల్​బీనగర్ కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహణ్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు మంత్రి హరీశ్ రావు సమక్షంలో ​బీఆర్ఎస్​లో చేరారు. బుధవారం ఎల్​బీనగర్​లోని రామ్మోహన్ గౌడ్ ఇంటికి వెళ్లిన హరీశ్​ రావు.. ఆయనకు పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్​లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడని.. తమతో కలిసి పని చేశాడన్నారు. సహచరుడిని కాపాడుకోవాలని వచ్చామని తెలిపారు. కష్టకాలంలో పార్టీ కోసం రామ్మోహన్ గౌడ్ పనిచేశారన్నారు. బీఆర్ఎస్​ నుంచి ఆయనకు రెండు సార్లు టికెట్ ఇచ్చామని… స్వల్ప మెజార్టీతో ఓడిపోయారని హరీశ్​ రావు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటును రామ్మోహన్ గౌడ్ అందించారన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి టికెట్ ఆశించి రామ్మోహన్ గౌడ్ భంగపడ్డారని హరీశ్ తెలిపారు. రామ్మోహన్ గౌడ్ కు బీఆర్ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యమిస్తుందన్నారు. ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు సైతం తగిన అవకాశాలు ఉంటాయన్నారు. పార్టీ ప్రతినిధిగా తాను వచ్చానన్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదని.. డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారన్నారు. అన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుపు ఖాయం అంటున్నాయని హరీశ్​ రావు ధీమా వ్యక్తం చేశారు. హైకమాండ్ ఢిల్లీలో ఉండే పార్టీ కావాలా? గల్లీలో ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలా అని జనం ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు.

Recent

- Advertisment -spot_img