HomeతెలంగాణSatyavathi Rathod : అనాధ పిల్లలకు మల్టీ-స్పెషాలిటీ స్థాయిలో పూర్తి ఆరోగ్య పరీక్షలు

Satyavathi Rathod : అనాధ పిల్లలకు మల్టీ-స్పెషాలిటీ స్థాయిలో పూర్తి ఆరోగ్య పరీక్షలు

Satyavathi Rathod : అనాధ పిల్లలకు మల్టీ-స్పెషాలిటీ స్థాయిలో పూర్తి ఆరోగ్య పరీక్షలు

Satyavathi Rathod : తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మరియు ఛాయిస్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అనాథ పిల్లల కోసం నిర్వహించిన సమగ్ర వైద్య పరీక్షల కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ….

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనాధ శరణాలయాలలో ఉంటున్న పిల్లలందరికీ మల్టీ-స్పెషాలిటీ స్థాయిలో పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం సంతోషకరం.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 24 అనాథ శరణాలయాల్లోని చిన్నారులను ఈ కార్యక్రమం ద్వారా పూర్తి వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించ బడుతున్నాయి.

ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ ఆరోగ్య పరీక్షలు మా పిల్లల కోసం చేయడం చాలా గొప్ప విషయం, దీనికి ముందుకు వచ్చిన ఛాయిస్ ఫౌండేషన్ కృషికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo తరపున ధన్యవాదములు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం లో శిశు సంక్షేమo కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో హైదరాబాద్ శిశువిహార్ కు గుర్తింపు రావడమే ఒక గొప్ప నిదర్శనం.

మహిళా భివృద్ధి శిశు సంక్షేమo ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 35,700 అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి పధకం ద్వారా ఆరోగ్యకర ఆహారాన్ని తల్లులకు మరియు పిల్లలకు అందించడం జరుగుతుంది.

పెద్దవాళ్ళమైన మనమే ఈ రోజుల్లో ఆరోగ్య పరీక్షలు చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తాము కానీ ఈ పిల్లలకు చిన్న వయస్సులోనే ప్రాధమికంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎదురవకుండా చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనాధ పిల్లల కోసం తల్లి,తండ్రి స్థానంలో ఉండి వారి బంగారు భవిష్యత్తు కోసం ఇటువంటి అనేక కార్యక్రమాలు జరుపుతూ ఎల్లవేళలా కృషి చేస్తుంది.

పిల్లలకు సంబంధించిన ఆరోగ్య కార్డులను మంత్రి అందించారు.

హైదరాబాద్ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమీషనర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img