ఇదే నిజం, బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ భుజంగరావు తన సిబ్బందితో కలిసి మంచిర్యాలలో పర్యటించారు. పలువురు బస్తీ వాసులతో మాట్లాడి వార్డు సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కొలపాక శ్రీనివాస్, పోచంపల్లి హరీశ్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.