Murder : తనను ప్రేమించిన యువతి పెళ్ళికి నిరాకరించిందని నడిరోడ్డు మీద నరికేసాడో యువకుడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ లో చోటు చేసుకుంది. దేవిక (22).. వెంకట సూర్యనారాయణ ప్రేమించుకున్నారు. ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలిసి ఇరుకుటుంబాలు వీరిద్దరి పెళ్లి మీద చర్చలు జరిగాయి. మృతిరాలి తల్లితండ్రులు పెళ్ళికి ఒప్పుకోలేదు. దీంతో సూర్యనారాయణ బాధతో హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇటీవల గ్రామానికి రాగా.. తను ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తి తో సన్నిహితంగా ఉంటున్నదని తెలుసుకున్నాడు.
పథకం ప్రకారం హత్య
దేవిక మోటార్ సైకిల్ మీద పక్క ఊరికి వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యింది. ఆమెను అనుసరించాడు. ఆమె వాహనాన్ని అపి పెళ్లి చేసుకోవాలని బ్రతిమిలాడాడు. అమ్మాయి నిరాకరించడం తో వెంట తెచ్చుకున్న కత్తి తో బలంగా నరికాడు. తీవ్ర రక్త శ్రావంతో గిల గీలా కొట్టుకుంటున్నా వదలకుండా చేతులు, కాళ్ళు నరికాడు