Homeహైదరాబాద్latest Newsస్వామి వివేకానంద జాతీయ అవార్డును అందుకున్న ముసిని సత్యం

స్వామి వివేకానంద జాతీయ అవార్డును అందుకున్న ముసిని సత్యం

ఇదే నిజం దేవరకొండ : దేవరకొండ పట్టణంకి చెందిన ముసిని సత్యం మంగళవారం నాడు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన బహుజన వెస్టర్న్ రైటర్స్ ఏడవ రాష్ట్రస్థాయి సమావేశం సందర్భంగా వెస్ట్రన్ ఇండియన్ కాన్ఫరెన్స్ లో బహుజన సాహిత్య అకాడమీ వారు అందించేటటువంటి అవార్డులలో భాగంగా జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ చేతుల మీద ముసిని సత్యం జాతీయ అవార్డును అందుకున్నారు. గత పది సంవత్సరాలుగా సోషల్ ఆక్టివిటీస్ లో ఇప్పుడున్న యువత మంచి మార్గంలో నడవాలని సందేశం ఇవ్వడంలో చేసినందుకు గాను సామాజిక సేవ చేసినందుకు గాన గుర్తించి అవార్డు అందించారు.అవార్డును సెలెక్ట్ చేసినటువంటి సెలక్షన్ రాష్ట్ర కమిటీ మెంబెర్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి 200 మంది డెలిగేట్స్ హాజరయ్యారు.బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నేను మరింత ఉత్సాహంతో సమాజక ఉద్యమాలలో పాల్గొని ప్రజలకు చేరువై అన్ని వర్గాలను కలుపుకొని పోయి సేవ చేస్తానని తెలిపారు.

Recent

- Advertisment -spot_img