Homeహైదరాబాద్latest Newsహనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న ముస్కు నిశాంత్ రెడ్డి

హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న ముస్కు నిశాంత్ రెడ్డి

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం ఆత్మకూరు గ్రామంలోనీ భక్తాంజనేయ ఆలయంలో జరుగుతున్నటువంటి పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి అనంతరం ఆత్మకూరు-ధమ్మన్నపేట గ్రామాల మధ్య క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేవెళ్ళ సత్యనారాయణ గౌడ్, భక్తాంజనేయ ఆలయ కమిటీ చైర్మన్ బొలిశెట్టి నరేష్,వైస్ చైర్మన్ రేగుంట బాపు, గుండ స్వామి, ఆలయ కమిటీ సభ్యులు ఆత్మకూరు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అత్తెన శివయ్య,దమ్మన్నపేట కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మామిడిపల్లి రమేష్, ఆత్మకూర్ గ్రామ ఉపసర్పంచ్ అత్తిన శివరాజ్యం, రాజు రాజేందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నేరెళ్ల మహేష్, ఓర్సు విజయ్,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img