Homeహైదరాబాద్latest Newsముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు

ముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తి శ్రధ్దల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ముస్తాబాద్, ఆవునూర్, కొండాపూర్ ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్నారులు ప్రత్యేక దుస్థులు ధరించి ఈద్గాల వద్ద ప్రార్థనలు చేయడం ఆకర్షించింది. మత గురువుల అనుసారంగా ప్రార్థనలు చేసి ఓకరికోకరు అలాయ్ బలాయి చేసుకోని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా మత గురువులు దైవాజ్ఞను అనుసరించి సమాజ హితంకోరి ప్రతీ మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందని తెలిపారు. తమకు కలిగిన దాంట్లోంచి ఎంతో కొంత ఇతరులకు పంచడమనే దాతృత్వ స్వభావాన్ని బక్రీద్ పండుగ ద్వారా నేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కో-ఆప్షన్ సభ్యులు సర్వర్ పాష, మండల కో-ఆప్షన్ సభ్యుడు షాదుల్ పాప, నజీర్, జహంగీర్, అస్లాం, ముక్తార్, షాదుల్, షాబోద్దిన్, తాజోద్దిన్, కలీం, హుస్సేన్, యూసూబ్, అక్రం, మునాఫ్, నజీర్, మహభూబలీ, నవాజ్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img