Homeహైదరాబాద్latest Newsనిరంజన్​ షావలి దర్గా ఉత్సవాలకు ముస్తాబు

నిరంజన్​ షావలి దర్గా ఉత్సవాలకు ముస్తాబు

– నేటి ఉదయం గంధం మహోత్సవం వేడుకలు ప్రారంభం
– రెండు లక్షల మంది రావొచ్చని అంచనా
– మతసామరస్యానికి ప్రతీకగా జాతర

ఇదేనిజం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో జరిగే ఉర్సు ఉత్సవాలకు నిరంజన్ షావలి దర్గా సిద్దమైంది. నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా అనేక మంది వచ్చి దర్గాను దర్శించుకుంటారు. అనేక మంది భక్తులు దర్గాను దర్శించుకుంటారు. ఈ ఉత్సవం గురువారం తెల్లవారుజామున అమ్రాబాద్, అచ్చంపేట నుంచి వచ్చే గంధం మహోత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయి. దాదాసు వారం రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. జాతరకు సుమారు లక్ష నుంచి రెండు లక్షల మంది రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉర్సు జాతరకు వచ్చిన భక్తులు తప్పకుండా ఉమామహేశ్వర క్షేత్రంలోని శివుడిని దర్శించుకుంటారు. హిందువులే కాకుండా ముస్లింలు కూడా మతాలకు అతీతంగా శివుడిని దర్శించుకుంటారు. జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు. ముఖ్యంగా పోలీసుశాఖ శాంతి భద్రతల విషయంలో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిందని.. సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు.

జాతరకు వెళ్తున్నారా? జాగ్రత్త
జాతరకు వెళ్తున్న భక్తులకు పోలీసుశాఖ కీలక సూచనలు చేసింది. జాతరలో తమ పిల్లల చేతులను పట్టుకుని ఉండాలని.. జాతరలో గుర్తుతెలియని వారు పిల్లలకు చాక్లెట్లు, బిస్కిట్లు లాంటి తినే పదార్థాలు ఇస్తే ఎవరు తీసుకోవద్దని .. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img