Homeహైదరాబాద్latest Newsఊరికి మంచి పేరు తీసుకురావడమే నా కల

ఊరికి మంచి పేరు తీసుకురావడమే నా కల

– ప్రతీ రోజూ పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను

– సత్త చాటుతున్న చెగ్యాం క్రీడాకారులు

– నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న విద్యార్ధులు

– జెట్టిపల్లి అశోక్ వ్యాయామ ఉపాధ్యాయులు

ఇదేనిజం, ధర్మపురి/ వెల్గటూర్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం వల్ల విద్యార్థులకు ఎక్కువ సమయం కేటాయించి హ్యాండ్బాల్ మెలికలు నేర్పిస్తున్నాను. విద్యార్థులు సెలవుల్లో మొబైల్ల్స్ మరియు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోనీ చదువుతో పాటు క్రీడల పై వారికి అవగాహన కల్పించాలి.అనునిత్యం సాధన ద్వార శారీరక దారుఢ్యం,మరియు మానసికొల్లసం వల్ల అందరు ఆరోగ్యంగా ఉంటారు.క్రీడాకారులను రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో ఆడిస్తాను. ఆటల రంగంలో వారికి మంచి ఉద్యోగం రావాలన్నదే నా కోరిక.

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు. మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఓవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు ఆటల్లో సత్తాచాటుతున్నారు. ప్రతి రోజు వివిధ క్రీడాంశాల్లో మెలకువలను తెలుసుకొంటున్నారు.ముఖ్యంగా హాండ్ వాలీ బాల్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.

విజయాలు ఇవీ..

2023 లో చెగ్యాం ఉన్నత పాఠశాల నుండి A అక్షయ ,U -14 హ్యాండ్ బాల్ విభాగంలో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నది.ఆర్.ఆశ్విత్ U 14 విభాగం లో సిల్వర్ మెడల్ సాధించి ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొన్నాడు.మంచిర్యాల జిల్లా భీమారంలో జరిగిన స్కూల్ ఆటలలో చెగ్యాం పాఠశాల నుండి నలుగురు విద్యార్థులు సి.హెచ్ రామ్ చరణ్, అశ్విత్ లు సిల్వర్ మెడల్ సాధించారు.అలాగే బాలికల విభాగంలో పవిత్ర, అక్షయ బ్రాంజ్ మెడల్ సాధించారు.అండర్ 17 విభాగంలో రామ్ చరణ్ రిషిత, వైష్ణవిలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు.హ్యాండ్ బాల్ తో పాటు అథ్లెటిక్స్ విభాగాలలో కూడా ఏ.శివమణి, మల్లికార్జున్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు.మొత్తంగా 15 మంది హ్యాండ్ బాల్ & అథ్లెటిక్స్ విభాగాలలో పాఠశాల నుండి పాల్గొని 1 గోల్డ్, 3 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించారు.విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించేలా పాఠశాల బృందం, గ్రామస్థులు,యువకులు వారిని ప్రోత్సహిస్తున్నారని ఉపాధ్యాయుల బృందం తెలిపారు.

Recent

- Advertisment -spot_img