ఒకప్పటి హీరోయిన్ స్నేహ గురించి తెలియని వారు ఉండరు. ‘ప్రియమైన నీకు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఫ్యామిలీ సినిమాల్లో నటించి అందం, అభినయంతో ఆడియన్స్‌ను మెప్పించింది. తమిళ సినీ నటుడు ప్రసన్నను 2021లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. తాజాగా తన భర్త ప్రసన్న గురించి ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. గతంలో తన భర్త మరో అమ్మాయిని ప్రేమించాడని, కానీ వారికి బ్రేకప్ అయిందని చెప్పారు. ఆ ప్రేమ వల్ల తనకు ఎలాంటి సమస్య లేదని, వారు బ్రేకప్ కాకపోతే ప్రసన్న తనకు భర్తగా దొరికే వాడు కాదని అన్నారు.