Homeజాతీయంనా మాటలను బీజేపీ తప్పుగా ప్రచారం చేసింది

నా మాటలను బీజేపీ తప్పుగా ప్రచారం చేసింది

– తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: సనాతన వివాదంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ మరోసారి స్పందించారు.కరూర్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని తప్పుపట్టారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన చేసిన ప్రకటనపై మరోసారి వివరణ ఇచ్చుకొన్నారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేసి మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో మోడీ వాడుకొన్నారని ఆరోపించారు. ‘నేను నరమేధానికి పిలుపు ఇచ్చినట్లు ప్రధాని చెప్పారు. ఈ క్రమంలో నేను అనని మాటలు కూడా అన్నట్లు మోడీ ప్రజలకు చెప్పారు. కానీ, నేను ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని మాత్రమే అన్నాను. దానిని వారు చిలువలు పలువలుగా వక్రీకరించారు. దీంతో దేశం మొత్తం నా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి’అని ఉదయనిధి పేర్కొన్నారు.‘నా తలపై ఓ బాబా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల బహుమతిని ప్రకటించారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో నడుస్తోంది. నాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. వారు క్షమాపణ చెప్పాలని కోరారు. నేను మాత్రం అటువంటిదేమీ ఉండదని చెప్పాను. నేను స్టాలిన్‌ కుమారుడిని, కలైంజ్ఞర్ మనవడిని. వారి భావజాలాన్ని మాత్రమే గౌరవిస్తానని వెల్లడించాను’అని ఉదయనిధి స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img