Homeవిచిత్రంసైన్స్​కు అంతుచిక్కని భారతీయ ఆలయాల మిస్టరీలు

సైన్స్​కు అంతుచిక్కని భారతీయ ఆలయాల మిస్టరీలు

భారతదేశమంటేనే మిస్టరీలకు పేరు, మన దేశం మొత్తం ఉండే ఎన్నో దేవాలయాలు, ఎన్నో కళాకండాలను ఆ రోజులలో ఎలా నిర్మించారు… ఇది ఎలా సాధ్యమైందని ఇప్పటికి కొన్ని దేవాలయాల గురించి తెలుసుకోలేకా మిస్టరీగా మిగిలిపోయాయి.

ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పరిశోధనలపై ఇంకా ఒక అంచనాకు రాలేకపోతున్న దేవాలయాలు ఎన్నో… మన దేశంలో ఉండే ఒకొక్క ఆలయానికి ఒకొక్క ప్రత్యేకత ఉంది వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

పూరిజగన్నాధ్ ఆలయం

ఒడిశాలో ఉన్న జగన్నాధ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలోను కనిపించదు.

ఇక ఈ ఆలయానికి దగ్గరలో సముద్రం ఉంది. ఆ సముద్రం శబ్దం కూడా ఆలయం లోపాలకి వెళితే వినపడదు.

జగన్నాధ ఆలయ సింహ ద్వారం వరకు సముద్ర ఘోష వినపడుతుంది. అది దాటి ఒక్కసారి లోపాలకి వెళ్లారో సముద్ర అలల శబ్దమనేదే వినపడదు.

ఎంతో ప్రశాంతంగా అసలు బయట సముద్రం ఉందా అన్న అనుమానం వస్తుంది. ఈ టెక్నాలజీ ఏమిటో అంతుచిక్కడం లేదు.

శని శింగనాపూర్

మహారాష్ట్రలోని ఒక గ్రామం పేరు శని శింగనాపూర్, ఇక్కడకు దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు వచ్చి శనిదేవునుని దర్శించుకు వెళ్తారు.

ఈ గ్రామంలో ఏ ఒక్క ఇంటికి తలుపులుండవు. ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటనలు కోడోత్ లేవు.

ఇక్కడ ప్రజల నమ్మకం ఏమిటంటే ఈ గ్రామంలో దొంగతనం చేస్తే శని దేవుడు… శని రూపంలో శిక్షిస్తాడని భక్తుల అపార నమ్మకం.

యాగంటి

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిలాల్లో ఉన్న యాగంటి గుడి విషయానికి వస్తే ఇక్కడ నంది మొదట్లో చాల చిన్నగా ఉండేదని, అది ఇప్పుడు పెరుగుతూ ఆలయ ప్రాంగణం అంతా ఆక్రమించుకుంటుందని స్థానికులు చెబుతుంటారు.

దీనిపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసి నందిని నిర్మించిన రాయికి పెరిగే స్వభావం ఉందని అందుకే ప్రతి 20 ఏళ్లకు ఒకసారి ఒక ఇంచు చొప్పును పెరుగుతూ ఉంటుందని అంటున్నారు.

కానీ ఇక్కడ భక్తుల నమ్మకం మాత్రం యుగాంతంలో ఇక్కడ నంది లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తుల నమ్మకం.

తంజావూరు బృహదీశ్వర ఆలయం

తంజావూరులోని బృహదీశ్వర ఆలయం మిస్టరీ కూడా ఎవరకి అంతు పట్టకుండా ఉంది. దీనిని 11వ శతాబ్దంలో రాజచోళుడు నిర్మించాడు.

ఈ ఆలయానికి ఉన్న రహస్యం ఏమిటంటే ఈ ఆలయ నీడలు ఎవరకి కనిపించవు. ఏడాది పొడుగునా ఏ రోజు చూసినా సాయంత్రం వేళ ఆ దేవాలయ నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరకి అంతు చిక్కడం లేదు.

ఇక ఈ ఆలయాన్ని నిర్మించిన గ్రానైట్ రాయి కూడా ఎక్కడ నుంచి తీసుకొని వచ్చారన్నది ఇప్పటికి కనుగొనలేకపోయారు.

లేపాక్షి

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉంది. ఇక్కడ ఉన్న స్థంబాలు ఇప్పటికి మిస్టరీగానే మిగిలిపోయాయి.

ఈ లేపాక్షి ఆలయంలో స్థంబాల కింద పేపర్ పెడితే ఇటు వైపు నుంచి అటు వైపుకు తీయవచ్చు.

అంటే స్థంబాలు నేలకు అనుకోని ఉండవు. అసలు స్థంబాలు నేలకు తాకకుండా ఆలయాన్ని ఎలా మొస్తుందో ఇప్పటికి అర్ధం కావడం లేదు.

ఈ విషయాన్ని గురించి ఎంతో మంది పరిశోధనలు చేసినా ఎవరు చెప్పలేకపోయారు.

అమ్రోహ

ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహ షార్పుద్ధీన్ షావిలాయత్ కు ప్రసిద్ధి చెందింది. ఈ దర్గా చుట్టూ కాపలాగా తేళ్లు ఉంటాయి.

ఒకటి రెండు కాదు కొన్ని వేల తేళ్లు ఈ దర్గా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడకు వచ్చే భక్తులకు అవి ఎలాంటి అపాయం చేయవు.

ఇంకా భక్తులు ఆ తేళ్లను పట్టుకుంటారు కూడా, కానీ ఈ మిస్టరీ కూడా బయట పెట్టలేకపోయారు. అలా ఎందుకు తేళ్లు ఉంటాయో ఇప్పటికి తెలియకుండా ఉంది.

షోలాపూర్

మనం రోజు ఉపయోగించే బెడ్ షీట్లతో పాటు చాల వస్తువులకు షోలాపూర్ ప్రసిద్ధి చెందింది. ఈ షోలాపూర్ దగ్గరలో ఒక వింత గ్రామం ఉంది.

ఆ గ్రామం పేరు షెత్పల్, ఈ గ్రామంలో పాములకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందట. ప్రతి ఇంట్లో ఒక గదిలో పాములు ఉంటాయట.

కొంతమంది సెపరేట్ గా గది కూడా ఏర్పాటు చేస్తారట. అవి ఇంట్లో మనుషులు తిరిగినట్లే తిరుగుతుంటాయట.

కానీ ఇంతవరకు ఆ గ్రామంలో ఒక్కరిని కూడా పాము కరిచినట్లు ఎవరు చెప్పింది లేదు. అసలు మనం పాముని చూస్తేనే అంత దూరం పారిపోతాం.

కానీ వారు రోజు పాములతోనే సావాసం చేస్తున్నారంటే అసలు తలచుకుంటేనే భయమేస్తుంది కదా.

ఇలాంటి ఎన్నో అద్భుతాలు మన పూర్వికులు మనకు ఒక పెద్ద మిస్టరీగా విడిచి పెట్టి వెళ్లారు.

ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇప్పటికి ఇలాంటి వాటి మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

భారతదేశంలో ఇలాంటి అద్భుతమైన కళాకండాలు ఉన్నాయి కాబట్టే బ్రిటిష్ వాడు మన దేశాన్ని కొల్లగొట్టాలని చూసాడు.

Recent

- Advertisment -spot_img