ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ అండ్ కాస్ట్లీమూవీ ‘కల్కి.. 2898 ఏడీ’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ నాగ్ అశ్విన్ డెరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ‘ప్రాజెక్ట్ కే’గా స్టార్ట్ అయ్యి గ్రాండ్‌గా తెరకెక్కుతోంది. ఇక ఈ మూవీకి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. కల్కి 2898 ఏడీ సినిమా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ గురించి హైదరాబాద్‌లో జరిగిన ఓ యానిమేషన్ ఈవెంట్‌లో నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘ కల్కి సినిమాకు వీఎఫ్ఎక్స్ అంతా ఇండియాలోనే చేయిద్దాం అనుకున్నా. మేకిన్ ఇండియా సినిమాగా తీయాలకున్నా. కానీ కొన్ని కారణాలు వల్ల కుదరలేదు. కథ, సినిమా గ్రాఫ్‌తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కారణంగా హాలీవుడ్ కంపెనీస్‌తో కలిసి గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ ఇండియాలోనే చేశాం. యానిమేషన్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ విషయంలో భవిష్యత్‌లో హాలీవుడ్ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. హాలీవుడ్‌కు ధీటైన చాలా సంస్థలు ఇండియాలోనే ఉన్నాయి.’ అని నాగ్ అశ్విన్ తెలిపాడు.అలాగే ఇక నెక్స్ట్ తన సినిమాకి మాత్రం పూర్తిగా ఇండియా టాలెంట్‌తోనే బెటర్ వీఎఫ్ఎక్స్ డిజైన్ చేసిన కంప్లీట్ మేకిన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తానని తెలిపాడు. అయితే, కల్కి సినిమా విషయంలో నాగ్ అశ్విన్ అండ్ టీం స్టార్టింగ్ నుంచే ఎన్నో విభాగాల్లో ఇండియా వైడ్‌గా ఎంతో మంది టాలెంట్‌ను ఆడిషన్ చేసిన సంగతి తెలిసిందే.