హైదరాబాద్: ఈ నెల 10న అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే దాని ఎదురుగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పోందుతున్న బెకెలి నాగులు (55) కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో నాగులు యాక్టివ్‌గా పాల్గొన్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ స్వప్నం సిద్ధించిన అతని ఆర్థిక సమస్యలు తీరకపోవడంతో తీవ్ర మనోవేదనకు
గురై ఒంటిపై పెట్రోల్ పోసుకోని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆత్మహత్యకు పాల్పడటం తెలంగాణ వాదులను తీవ్రంగా కలచివేసింది.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ కు చెందిన నాగులు స్వగ్రామంలో బతుకుదెరువు లేకపోవండంతో ఇరవై సంవత్సరాల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి చిన్న చితకా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ప్రస్తుతం పంజగుట్టలోని ఒక అపార్ట్ మెంటులో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. వచ్చే చాలీచాలని జీతంతో పిల్లలను ఉన్నత చదువులు చదివించలేకపోతున్నానని మనోవేదనకు గురైనాడు.
అసెంబ్లీ ముందు ఆత్మహత్యకు పాల్పడ్డ నాగులు చనిపోయాడు
RELATED ARTICLES