Homeహైదరాబాద్latest Newsజిల్లాలో విత్తనాల కొరత లేదు

జిల్లాలో విత్తనాల కొరత లేదు

ఇదే నిజం, నల్గొండ టౌన్ : నల్గొండ జిల్లాలో పత్తి, ఇతర పంటల విత్తనాలకు ఎలాంటి కొరత లేదని రైతులకు అవసరమైన విత్తనాల సరఫరాకై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మండలాల వారిగా అవసరమైన విత్తనాలు, పచ్చిరొట్ట విత్తనాలు 65% రాయితీపై గుర్తింపు పొందిన విత్తన విక్రయ కేంద్రాల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అవసరం ఉన్నవాళ్లు తమ మండల కేంద్రాల్లోని వ్యవసాయ అధికారిని లేదా గుర్తింపు పొందిన విత్తన విక్రయ కేంద్రాల ద్వారా తీసుకోవచ్చని చెప్పారు.

Recent

- Advertisment -spot_img