Homeహైదరాబాద్latest NewsVIRAL: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నందమూరి చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్..ఎందుకంటే?

VIRAL: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నందమూరి చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్..ఎందుకంటే?

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నందమూరి చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని నందమూరి చైతన్య కృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మద్దతు ఇచ్చారని చెబుతున్నారని, మీరెవరూ.. మమ్మల్ని ఏం పీకలేరు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేనుండగా చంద్రబాబునాయుడు మామయ్యను, నందమూరి బాలకృష్ణ బాబాయిని టచ్ కూడా చేయలేరు అంటూ చైతన్య కృష్ణ పోస్ట్ పెట్టారు. తన సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వైఎస్ఆర్ సీపీ కలిసి తనని ట్రోల్ చేశారని గుర్తు చేసిన ఆయన, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. జాగ్రత్తగా ఉండాలంటూ హితువు పలికారు.

Recent

- Advertisment -spot_img