Homeహైదరాబాద్latest Newsనంది అవార్డు గ్రహితకు అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

నంది అవార్డు గ్రహితకు అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

ఇదేనిజం, లక్షెట్టిపేట : పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో సోమవారం నంది అవార్డు గ్రహితకు అంబెడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఎంఆర్ దాస్ మాట్లాడుతూ.. మండలానికి చెందిన కుశనపెళ్లి దీప్తి ఇప్పటివరకు అనేక మందిని వివిధ దేశాలకు ఉన్నతవిద్య కోసం పంపించారన్నారు. ఇందుకుగాను ఈ నెల 1న హైదరాబాద్ రవీంద్రభారతిలో నంది అవార్డు తీసుకున్నాందుకు అభినందనలు తెలిపారు. మున్ముందు అనేక మంచి కార్యక్రమాలు చేసి భవిష్యత్తులో మంచి పేరు తీసుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం నాయకులు శనిగారపు లింగన్న, మాలెం చిన్నన్న, తొగరు కాంతయ్య, దమ్మనారాయణ, చుంచు రమేష్, లింగంపెళ్లి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img