Homeఫ్లాష్ ఫ్లాష్Natasa Hardik Divorce: హార్దిక్, నటాషా మళ్లీ ఒక్కటయ్యారా..? పెళ్లి ఫొటోలు మళ్లీ తిరిగి వచ్చేశాయ్..!

Natasa Hardik Divorce: హార్దిక్, నటాషా మళ్లీ ఒక్కటయ్యారా..? పెళ్లి ఫొటోలు మళ్లీ తిరిగి వచ్చేశాయ్..!

బాలీవుడ్ నటి మరియు సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిచ్ తన భర్త, క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో మళ్లీ కలిశారా? వారు విడాకులు తీసుకోలేదా? ఇటీవల, నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వారి వివాహ ఫోటోలను రీస్టోర్ చేసింది. దీనితో ఈ వార్త మరోసారి తెరపైకి వస్తోంది. కొన్ని వారాలుగా వీరి విడాకుల వార్త వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయి బాలీవుడ్ నటి అయిన నటాషా కొన్నాళ్ల కిందట ఇన్‌స్టాగ్రామ్ లో తన పేరు మార్చుకోవడం, ఐపీఎల్లో హార్దిక్ ఆడిన మ్యాచ్ కు రాకపోవడం, తమ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టా అకౌంట్ నుంచి తొలగించడంతో వీళ్లు విడిపోతున్నారన్న పుకార్లు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు వీరి పెళ్లి ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్ లో తిరిగి రావడంతో మళ్లీ కలిసిపోయారా అని కూడా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ జంట మాత్రం దీనిపై స్పందించలేదు. అటు హార్దిక్ గానీ, ఇటు నటాషాగానీ నోరు విప్పడం లేదు.

Recent

- Advertisment -spot_img