Homeహైదరాబాద్latest NewsALP కి జాతీయస్థాయి అవార్డు

ALP కి జాతీయస్థాయి అవార్డు

ఇదే నిజం, రామగిరి: సింగరేణి సంస్థ ఏపీఏ పరిధి అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ (ఏఎల్‌పీ)కు 2023-2024 సంవత్సరానికి సంబంధించిన బెస్ట్ టెక్నాలజీ మైన్ ఇన్ అండర్ గ్రౌండ్ కోల్ జాతీయస్థాయి అవార్డు దక్కింది. ఏపీఏ జియం కే వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఆఫీసరు కే నాగేశ్వర రావు, అడిషనల్ మేనేజర్ శ్రీకాంత్ “డీప్ అండర్ గ్రౌండ్ కోల్ మైనింగ్‌లో సమర్థత, భద్రతను పెంచటం, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కూలింగ్, ట్యుబ్ బండిల్ గ్యాస్ మానిటరింగ్ సిస్టమ్‌లతో కూడిన ఏఎల్‌పీ కేస్ స్టడీని సమర్పించారు. దాని ఆధారంగా బెస్ట్ టెక్నాలజీ మైన్ ఇన్ అండర్ గ్రౌండ్ కోల్ 2023-2024 కేటగిరీలో భాగంగా భువనేశ్వర్‌లో జరిగిన సదస్సులో ఏఎల్‌పీ గనికి అవార్డు దక్కగా దానిని గని మేనేజర్ ములుకుంట్ల తిరుపతి అందుకున్నారు.

Recent

- Advertisment -spot_img