Homeహైదరాబాద్latest Newsజాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

ఇదేనిజం, వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని గురువారం రోజున జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని మండల కేంద్రంలోనీ ప్రాథమిక పాఠశాలలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మి లింగయ్య గారు ప్రారంభించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ నులి పురుగుల వలన పిల్లలకు ఎన్నో నష్టాలు కలుగుతాయి అని పిల్లలు ఎల్లపుడూ పరిశుభ్రంగా ఉండాలని తెలియజేశారు మరియు నులి పురుగులకు నివారణకు తగు జాగ్రత్తలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు అల్బెండోజోల్ టాబ్లెట్ లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావణ కుమార్, అంబర్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ లవకుమార్ ఆర్.బి.ఎస్.కే వైద్యాధికారి విజయ్ మరియు ఎంపీవో శ్రీనివాస్ సూపర్వైజర్ లు శ్రీనివాస్ , చంద్ర లీల , ఐసిడిఎస్ సూపర్వైజర్ ఆండాలు ఏఎన్ఎం జయప్రద ఆరోగ్య కార్యకర్తలు పాఠశాల సింబంది విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img