Homeజిల్లా వార్తలులయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్స్ డే: లయన్స్ క్లబ్ అఫ్ దేవరకొండ మిత్ర

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్స్ డే: లయన్స్ క్లబ్ అఫ్ దేవరకొండ మిత్ర

ఇదే నిజం దేవరకొండ: సోమవారం జాతీయ డాక్టర్స్ డే సందర్బంగా దేవరకొండ పట్టణంలో స్థానిక డాక్టర్లు.. డాక్టర్.శంకర్ నాయక్, డాక్టర్. లయన్ చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్. జనార్ధనరావు లను శాలువలతో సన్మానం చేయడం జరిగినది మరియు వారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసినారు. అధ్యక్షులు లయన్ కూరెళ్ల కృష్ణ చారి మాట్లాడుతూ… డాక్టర్ దేవుడితో సమానం, అమ్మా, నాన్న జన్మనిస్తే అనంతరం మనలని జీవితాంతం కాపాడేది డాక్టలే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లయన్ మాకం మహేష్, కోశాధికారి లయన్ నామ దామోదర్, పాస్ట్ మిత్ర అధ్యక్షులు లయన్ అంకం చంద్రమౌళి, సంధ్య రెడ్డి, ఎల్లయ్య, వనం యాదయ్య, బ్రాహ్మచారి, కుంభం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాలుగోన్నారు.

Recent

- Advertisment -spot_img