Homeహైదరాబాద్latest Newsజాతీయ నులి పురుగుల అవగాహన కార్యక్రమం

జాతీయ నులి పురుగుల అవగాహన కార్యక్రమం

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో వైద్య అధికారి నరేష్ ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల కార్యక్రమం జరిగింది.వైద్య అధికారి నరేష్ మాట్లాడుతూ మండలంలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలను 10,590 మందిని గుర్తించాము.జూన్ 20న జరిగే పిల్లలందరికీ అల్బెండజాల్ మాత్రలు వేయవలెను.పాఠశాలకు రాని పిల్లలకు జూన్ 27న మాత్రలు వేయవలెను. ఈ వ్యాధి పిల్లలు నీరసముగా, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అనారోగ్యంతో బాధపడుతుంటారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవలెనని, మలవిసర్జన బయటకు విసర్జించవద్దని, వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలని, పరిశుభ్రమైన నీరు తాగవలెనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాంరెడ్డి, సిహెచ్ఓ గట్టు శ్రీధర్, సూపర్వైజర్లు నరేందర్, రమేష్, శారద, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img