Homeహైదరాబాద్Seminar about Mental Health : మానసిక ఆరోగ్యంపై ఆన్​లైన్​ సదస్సు

Seminar about Mental Health : మానసిక ఆరోగ్యంపై ఆన్​లైన్​ సదస్సు

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, Mano Jagrithi సంస్థ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా Mano Jagrithi సంస్థ National record on Longest Seminar about Mental Health During Covid-19 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా Mano Jagrithi సంస్థ ఫౌండర్ డా.గీతా చల్లా మాట్లాడుతూ ఈ సంవత్సరం కరోనా మహమ్మారి ప్రపంచం మొతాన్ని ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, శారీరకంగా ఎంతో మందిని బలి తీసుకోవడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నష్టం తీర్చలేనిదని అయితే మానసికంగా ప్రజలను బలంగా చేయాలనే సంకల్పంతో తమ సంస్థ తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమె విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో డా.గీతా చల్లా 12 గంటల పాటు అనర్గళంగా మాట్లాడి కొత్త రికార్డుని సృష్టించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 140 మంది మనోజాగ్రితి సంస్థ సభ్యులైన మానసిక నిపుణులు పాల్గొన్నారు.

దీనిలో ముఖ్యంగా కరోనా రాకముందు, వచ్చిన వారు, కుటుంబ సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, పరిస్థితులను దైర్యంగా ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలఫై CASE STUDIES ద్వారా 12 గంటల పాటు సుదీర్గంగా మాట్లాడారు.

ఈ కార్యక్రమం ఆధ్యంతం చాలా ఆసక్తికరంగా జరిగింది. ZOOM MEETING ద్వారా సభ్యులందరు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి B.సుమతి IPS, DIG, CID Women safty Wing, Telangana గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

గౌరవ అతిథులు మరియు Mano Jagrithi సంస్థ శ్రేయోభిలాషులు అయినటువంటి

  • డా. నిరంజన్ రెడ్డి, క్లినికల్ సైకాలజిస్ట్ ,
  • డా.శేఖర్ రెడ్డి, సైకియాట్రిస్ట్ ,
  • డా. జార్జ్ రెడ్,డి సైకియాట్రిస్ట్ ,
  • డా. రాధికా ఆచార్య, క్లినికల్ సైకాలజిస్ట్,
  • డా. వెంకట సుబ్బయ్య, క్లినికల్ సైకాలజిస్ట్,
  • డా . P.స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్

గౌరవ అతిథులుగా కార్యక్రమ ముగింపు సమావేశంలో పాల్గొని వారి యొక్క అమూల్యమైన సందేశాలను అందించారు, మనోజాగ్రితి సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు.

Covid-19 సమయంలో , మానసిక నిపుణుల అవసరం ఎంతైనా వుందని కావునా అందరూ మానసిక నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సంస్థ సభ్యులు కోరారు.

Recent

- Advertisment -spot_img