Homeజిల్లా వార్తలుదేవరకొండ లో ఘనంగా జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు: విద్యార్థి శక్తి జాతీయ శక్తి.ఏబీవీపి

దేవరకొండ లో ఘనంగా జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు: విద్యార్థి శక్తి జాతీయ శక్తి.ఏబీవీపి

ఇదే నిజం దేవరకొండ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజున జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నగరంలోని పాఠశాల విద్యార్థులు కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని భరతమాత నినాదాలతో తాటి కోల్ X రోడ్ నుండి బస్టాండ్ వరకు ఘనంగా ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ విద్యార్థి శక్తి – జాతీయ శక్తి అంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జులై 9న ఢిల్లీ యూనివర్సిటీలో ఓం ప్రకాష్ బెహల్ అనే ఒక ప్రొఫెసర్ నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచింది. ఏబీవీపీ దేశం కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది మన దేశం లోకి అక్రమంగా చొరబడుతున్న బాంగ్లాదేశ్ ఉగ్రవాదులను మనదేశంలో అడుగుపెట్టకుండా చేసింది. ఈ యొక్క భారతదేశాన్ని ఇండియా అని పిలుస్తుండగా ఇది ఇండియా కాదు భారతదేశమంటూ ఏబీవీపీ తెలియజేసింది. అంతేకాదు మన దేశంలో ఉన్న కాశ్మీర్ లోని లాల్ చౌక్ లో పాకిస్తాన్ తీవ్రవాదులను ఎదురోడ్డి జాతీయ జెండాని ఎగరవేసిన ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ది అని అన్నారు. లక్షలాది మంది విద్యార్థులతో క్షణం క్షణం మా కణం కణం భరతమాత కి సమర్పణం అంటూ దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని మరో ఆర్మీ సైన్యంలా పని చేసే కార్యకర్తలు ఏబీవీపీ కార్యకర్తలు అని అన్నారు. తెలంగాణలో జాతీయ జెండా కోసం బలిదానమైన ఏబీవీపీ నాయకుడు ఏచురి శ్రీనివాస్ మరియు నెల్లూరు లో జరిగిన రాష్ట్ర మహాసభలలో జై తెలంగాణ అనే నినాదంతో ఆ యొక్క నినాదాన్ని ఎజెండాగా పెట్టుకొని తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో ఏబీవీపీ ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంతోమంది దేశభక్తి దేయనిష్ట పెంపొందిస్తూ ప్రతి సంవత్సరం ఎంతోమంది కొత్త విద్యార్థులు స్వాగతిస్తూ దేశంలో ఒక స్టూడెంట్ ఆర్మీల తయారు చేసే సంస్థ మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యలమల గోపీచంద్ నగర కార్యదర్శి లింగాల రాకేష్, నగర జాయింట్ సెక్రెటరీ అంకురి శ్రీకాంత్, ఈశ్వర్, సోషల్ మీడియా యలమల హేమ సుందర్, ఎం కె ఆర్ కళాశాల అధ్యక్షుడు దామోజీ అమితేష్, సైదులు, సిద్దు, భరత్, శివ, మహేందర్, మారుతి, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img