Homeహైదరాబాద్latest Newsమధిరలో ఘనంగా జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

మధిరలో ఘనంగా జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

ఇదే నిజం, మధిర: మధిర లోని శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగ గురూజీ నాళ్ల శ్రీనివాసరావు వారి ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తదుపరి యోగ గురూజీ నాళ్ళ శ్రీనివాసరావును ఘనంగా యోగ సభ్యులందరూ ఘన సన్మానం చేసినారు. యోగా గురూ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా విశిష్టతను విశ్వవ్యాప్తం చేయాలని అందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్క వ్యక్తి యోగ పై అవగాహన కలిగి ఉండాలని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ప్రతిరోజు నిత్యవసరంగా ఒక గంట పాటు ఏదో ఒక వ్యాయామం చేయాలని, ఇప్పటి కంప్యూటర్ కాలంలో ప్రతి మనిషి కూడా బిజీ బిజీ గా ఉండటంతో మనశ్శాంతి లేకుండా ఒత్తిడికి లోనై అనేక రకాల జబ్బులకు లోనవుతున్నారు. కావున ఇటువంటి వ్యక్తులకు యోగా నే పరిష్కారం, యోగా, ధ్యానం వలన మనిషికి ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు.

అలాగే నిత్యం గత 20 సంవత్సరాల నుంచి కూడా యోగ సాధన నేర్పుతూ ఎంతోమందికి యోగా ను పరిచయం చేసి మన్నలను పొందిన యోగా గురూజీ శ్రీనివాస రావు అతను వృత్తిపరంగా వ్యాపారం చేస్తూ అలాగే రిపోర్టర్ గా పనిచేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని అవలీలగా నేర్పుతో ఓర్పుతో చేయటం ఆయనకు ఆయనే సాటి ఇది కేవలం యోగా వలన సాధ్యమైందని పలువురు యోగ సభ్యులు కొనియాడారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వనమా వేణుగోపాలరావు (సూరి), బిజెపి మధిర నియోజకవర్గం ఇంచార్జ్ ఏలూరు నాగేశ్వరరావు, యోగా సాధకులు మందడపు రామారావు, మందడపు నాగేశ్వరమ్మ, లింగంపల్లి అప్పారావు, స్వర్గం శ్రీనివాసరావు, తిరపతి, వెంకటరావు, శ్రీనివాసరెడ్డి, కల్పన, జ్యోతి, హైందవి, ధనుషా, రాజ్యలక్ష్మి, అరుణ, సత్యనారాయణ, హెల్త్ సూపర్వైజర్ భాస్కరరావు, హెల్త్ సూపర్వైజర్ లంకా కొండయ్య, వేముల ఆంజనేయులు, డాక్టర్ పృథ్వీరాజ్, రాజు, శ్రీనివాసరావు, జీవన కృష్ణతదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img