Homeఫ్లాష్ ఫ్లాష్Clean Lungs : సహజ సిద్దంగా ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవడం ఎలా..

Clean Lungs : సహజ సిద్దంగా ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవడం ఎలా..

Clean Lungs : సహజ సిద్దంగా ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవడం ఎలా..

Clean Lungs – నిత్యం సిగరెట్‌, బీడీ, మద్యం తాగేవారికే కాదు, కాలుష్యంలో తిరిగేవారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు పొంచి ఉంటాయి.

ఊపిరితిత్తులు విష వ్యర్థాలతో నిండిపోయి అనేక సమస్యలు వస్తాయి.

అయితే ఈ సహజ సిద్ధమైన చిట్కాలు పాటిస్తే ఊపిరితిత్తుల ( Lungs )ను శుభ్రం చేసుకోవచ్చు.

మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు వెళ్లిపోతాయి.

దీంతో ఊపిరితిత్తులు కూడా శుభ్రమవుతాయి. అయితే నిమ్మరసానికి బదులుగా పైనాపిల్, క్రాన్‌బెర్రీ జ్యూస్‌లను కూడా తాగవచ్చు.

పరగడుపునే ఒకటి లేదా రెండు టీస్పూన్ల అల్లం రసం సేవించినా ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.

ఉదయాన్నే 3 నుంచి 5 పుదీనా ఆకులను అలాగే నమిలి మింగితే ఊపిరితిత్తులకు బలం కలుగుతుంది. అలాగే ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.

రోజూ ఉదయాన్నే ప్రాణాయామం చేయడం వల్ల కూడా ఊపిరితిత్తులను శుభ్రంగా మార్చుకోవచ్చు.

గోరు వెచ్చని నీటిలో 5 నుంచి 10 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి అనంతరం వచ్చే ఆవిరిని పీలిస్తే ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.

ఛాతిపై నిత్యం ఆముదాన్ని మర్దనా చేస్తుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

Recent

- Advertisment -spot_img