HomeTelugu Newsరాముడు మాంసం తినేవాడు: ఎన్సీపీ నేత జితేంద్ర వ్యాఖ్యలు దుమారం..

రాముడు మాంసం తినేవాడు: ఎన్సీపీ నేత జితేంద్ర వ్యాఖ్యలు దుమారం..

కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తి భావంతో కొలుచుకునే శ్రీరాముడిని ఉద్దేశించి ఎన్సీపీ నేత జితేంద్ర చేసిన దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. రాముడు మాంసాహారి అని ఆయనన్నారు. మహారాష్ట్రలోని షిరిడీలో ఆయన మాట్లాడుతూ… ‘రాముడు బహుజనులకు చెందినవాడు. వేటాడటం, జంతువులను తినడం చేసేవాడు. రాముడిని చూపుతూ వీళ్లంతా అందరినీ శాకాహారులుగా మార్చాలనుకుంటున్నారు. కానీ రాముడు మాంసాహారి. 14 ఏళ్లు అడవుల్లో గడిపిన రాముడు వెజిటేరియన్ ఫుడ్ ను ఎక్కడి నుంచి తెచ్చుకోగలడు?’ అని అన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన వేళ జితేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ముంబైలోని ఆయన నివాసం వద్ద హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, ఆయన నివాసం వద్ద పోలీసులు బందోబస్తును పెంచారు. మరోవైపు బీజేపీ నేత రామ్ కదమ్ మట్లాడుతూ… జితేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img