Homeజిల్లా వార్తలుకల్వర్టు సమీపంలో..పొంచిఉన్న ప్రమాద

కల్వర్టు సమీపంలో..పొంచిఉన్న ప్రమాద

ఇదే నిజం, నల్లబెల్లి : వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ నుంచి నల్లబెల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాదం పొంచి ఉంది. రోడ్డుపై ఉన్న కల్వర్టుకు ఇరు వైపులా పెద్ద గుంతలు పుడ్చకుండా వదిలేశారు. దాంతో ప్రయాణానికి ఇబ్బందికరంగా మారింది. వాహనదారులు వెళ్లేందుకు అవస్థ పడుతున్నారు. నిత్యం రెండు గ్రామాల ప్రజలు ప్రయాణించే రోడ్డుపై అధికారులు కనీసం ప్రమాద సూచిక బోర్డు కూడా పెట్టకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.


Recent

- Advertisment -spot_img