HomeజాతీయంRTPCR Test | ఇక‌ బ్రిట‌న్‌ వెళ్లే వారికి ప్రీ-ఆర్టీపీసీఆర్ టెస్ట్ అక్క‌ర్లేదు

RTPCR Test | ఇక‌ బ్రిట‌న్‌ వెళ్లే వారికి ప్రీ-ఆర్టీపీసీఆర్ టెస్ట్ అక్క‌ర్లేదు

RTPCR Test | ఇక‌ బ్రిట‌న్‌ వెళ్లే వారికి ప్రీ-ఆర్టీపీసీఆర్ టెస్ట్ అక్క‌ర్లేదు

RTPCR Test | బ్రిట‌న్‌కు వెళ్లే భార‌తీయులు, ఇత‌ర ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌..

బ్రిట‌న్ వ‌చ్చే వారు విమాన ప్ర‌యాణానికి ముందే ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్ట్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించ‌న‌వ‌స‌రం లేదు.

ఈ సంగ‌తిపై భార‌త్‌లో బ్రిట‌న్ హై క‌మిష‌న‌ర్ అలెక్స్ ఇల్లిస్ గురువారం ట్వీట్ చేశారు.

బ్రిట‌న్‌కు వ‌చ్చే భార‌తీయుల‌కు ప్రీ-ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగెటివ్ స‌ర్టిఫికెట్‌తోపాటు ప‌లు నిబంధ‌న‌ల‌ను స‌ర‌ళ‌త‌రం చేసింది.

పూర్తిగా వ్యాక్సినేష‌న్ చేయించుకున్న యువ‌కులు, 18 ఏండ్ల‌లోపు పిల్ల‌లు ఈ నెల ఏడో తేదీ ఉద‌యం 4 గంట‌ల నుంచి ప్రీ-ఆర్టీపీసీఆర్ నెగెటివ్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం లేద‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ట్వీట్ చేశారు.

Ginger Water : ఉద‌యం వెల్లుల్లి నీటిని తాగితే బెనిఫిట్స్‌..

Omicron Symptoms : ఒమిక్రాన్ సోకిన వారిలో ఈ ల‌క్ష‌ణాలు.. చ‌ర్మం, పెద‌వులు, గోళ్లు

అయితే, బ్రిట‌న్‌లోకి రాగానే పూర్తిగా వ్యాక్సినేష‌న్ చేయించుకున్న యువ‌జ‌నులు, పిల్ల‌లు త‌ప్ప‌నిస‌రిగా టెస్ట్ చేయించుకోవాలి.

క‌రోనా పాజిటివ్‌గా వ‌స్తే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి.

జ‌న‌వ‌రి 11 నుంచి ఇంగ్లండ్‌లో విమానాశ్ర‌యంలో దిగిన త‌ర్వాత నిర్వ‌హించే ఫ్లో టెస్ట్‌లో క‌రోనా అని తేలితే ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష అవ‌స‌రం లేద‌ని బ్రిట‌న్ హైక‌మిష‌న్ కార్యాల‌యం తెలిపింది.

అయితే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల‌ని పేర్కొంది.

Marriage Ad : అరేంజ్‌డ్ మ్యారెజ్ నుంచి నన్ను కాపాడండంటూ యాడ్

WhatsApp DP : వాట్సాప్​ డీపీలుగా సొంత ఫోటోలు పెడుతున్నారా

Recent

- Advertisment -spot_img