సీఎం రేవంత్ కు కౌంట్ డౌన్ మొదలైందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. 2025 జూన్ నుంచి డిసెంబర్ లోపు రాష్ట్రానికి కొత్త సీఎం రావొచ్చని శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త సీఎం వేటలో కాంగ్రెస్ అధిష్టానం ఉందని తెలిపారు. మూసీని రేవంత్ స్వార్థం కోసం వాడుకుంటున్నారని పార్టీ అధిష్టానం భావిస్తుందన్నారు. కాంగ్రెస్ మంత్రులు రేవంత్ పై ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశారని ఆరోపించారు.