MSP Committee : కనీస మద్దతు ధర పెంపుకు కేంద్రం కొత్త కమిటీ
MSP Committee : పండిన పంటకు కనీస మద్దతు ధరపై 29 మందితో కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసింది.
ఈ కమిటీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేశారు.
ఎంఎస్‌పీతో పాటు జీరో బడ్జెట్ వ్యవసాయం, వ్యవసాయ మార్పిడి వంటి అంశాలపై ఈ కమిటీ పనిచేయనుంది.
ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాల నేతలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థిక వేత్తలు ఉన్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు.
కమిటీ చైర్మన్‌గా మాజీ వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ వ్యవహరిస్తారు.
సభ్యులుగా నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్, ఆర్థిక వేత్త సిఎస్‌సి శేఖర్, రైతు భరత్ భుషన్ త్యాగి, ఎస్‌కెఎంకు చెందిన ముగ్గురు సభ్యులు ఉంటారు.
అలాగే మరికొంత మంది నిపుణులు కమిటీలో భాగస్వామ్యం అవుతారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, సిక్కిం, ఒడిశా నుంచి అడిషనల్ చీఫ్ సెక్రటీరలు సభ్యులుగా ఉన్నారు.
ఎంఎస్‌పీకి మూడు విధి విధానాలు వివరిస్తూ….కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
వ్యవస్థను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా చేయడం ద్వారా ఎంఎస్‌పిని అందుబాటులో ఉంచడానికి సూచనలు చేయాలని తెలిపింది.
కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్‌కు మరింత స్వయంప్రతిపత్తి కల్పించేందుకు సూచనలు చేయాలని కోరింది.
అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేసే అంశాలపై సూచనలు ఇవ్వాలని చెప్పింది.
అలాగే ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడికి కూడా సలహాలు, సూచనలు చేయాలని తెలిపింది.
అయితే ఈ కమిటీ పై విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి.
రైతు చట్టాల రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్న వారినే ఈ కమిటీలో చేర్చారన్న విమర్శలున్నాయి.
మరోవైపు ఎంఎస్‌పీపై మోసం చేశారని చెబుతున్న రైతు సంఘం నేత రాకేశ్ టికాయత్ మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చారు…