తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా, ఇందుకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేసింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో ఇక రేషన్ కార్డులు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అధికారులు నేటి నుంచి 5 రోజులపాటు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు.